తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ తిరుమలదేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు న్యాయమూర్తులుగా కొనసాగుతారని, మిగిలిన ముగ్గురూ రెండేళ్ల పాటు కొనసాగుతారని తెలిపారు. వీరు శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.