ఏపీలో హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత.. ఒకప్పడు టీచర్. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన వున్నప్పటికీ పరిస్థితులు సహకరించలేదు. ఆమె విద్యార్హతను చూసి నేనున్నానంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. తాను టీచర్‌గా పనిచేసిన నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్ ను విమర్శిస్తూ లేడీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో రెండోసారి గెలవడంతో హోంమంత్రి పదవి దక్కింది.