బోర్డర్-గవాస్కర్ ట్రోఫిలో భాగంగా డిసెంబర్ 14 నుంచి భారత్-ఆసీస్ మధ్య మూడో టెస్ట్ జరగనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. పిచ్ ఈసారి ఎలా ఉంటుందో అని క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే గబ్బా పిచ్ క్యూరేటర్ డేవిడ్ పిచ్ రిపోర్టును విడుదల చేశారు. గతంలో మాదిరిగానే బౌన్సీ పిచ్‌ను తయారు చేశామని, బ్యాటర్లకూ ఈ పిచ్ సహకరిస్తుందనే సంకేతాలు ఇచ్చారు.