అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన బర్పటి బాల్ సాయిలు అనే వ్యక్తి గుడిసె ఆదివారం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకొన్న
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మోపతయ్య సోమవారం గ్రామ నాయకుల ద్వారా బాధిత కుటుంబానికి రూ.3000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.