నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోతారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, టీఎస్ యుటిఎఫ్, కెవిపిఎస్ ప్రజాసంఘాల నేత పులిజాల పరుశరాములు పదవి విరమణ కార్యక్రమంలో మంగళవారం ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు పరుశురాములుపై మార్క్సిజం ప్రభావం ఉందని, మార్క్సిజమే మానవాళి విముక్తి మార్గమని అన్నారు. శేష జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేయాలని కోరారు.