ఉప్పునుంతల మండలం తాడూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రం, పల్లె దవాఖాన భూమి పూజ కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే, విద్యా పరిస్థితులపై సమీక్ష చేపట్టి, అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.