బల్మూరు మండలం గోదల్ గ్రామంలో మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం అయోధ్యకు గ్రామం నుండి మూడుసార్లు కరసేవకు వెళ్లిన వావిలాల రాంరెడ్డిని స్మరించుకున్నారు. ఆయన సేవలు మరువలేనివని భజనపరులు అన్నారు. అనంతరం ఆయన కుమారులు శ్రీరామ భక్తులు వావిలాల అనిల్ రెడ్డి, వావిలాల సునీల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.