పొలానికి వెళ్లేందుకు.. ఇలా ప్లాన్​ చేశారు

74చూసినవారు
పొలానికి వెళ్లేందుకు.. ఇలా ప్లాన్​ చేశారు
పొలాలకు వెళ్లేందుకు కొంత మంది రైతులు వెదురు బొంగుతో బ్రిడ్జిలా ఏర్పాటు చేసుకొని వాగు దాటుతున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామానికి కొద్ది దూరంలో లింగమయ్య వాగు ప్రవహిస్తుంది. వాగు అవతల 30మంది రైతులకు 100ఎకరాల భూమి ఉంది. ఈ వాగును దాటడానికి రైతులు వెదురు బొంగుతో బ్రిడ్జిలా నిర్మించుకున్నారు. పొలాలకు వెళ్లేందుకు తిప్పలు పడుతున్నామని, చిన్నపాటి బ్రిడ్జి నిర్మిస్తే తమ సమస్య తీరుతుందని గురువారం చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్