పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణమని ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ పాలనకు నిదర్శనని అన్నారు.