బండ్ల రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి: మహిళ మోర్చా అధ్యక్షురాలు

67చూసినవారు
బండ్ల రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి: మహిళ మోర్చా అధ్యక్షురాలు
గద్వాల పట్టణంలోని డికె బంగ్లాలో విలేకరుల సమావేశం గురువారం జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు టి. క్రిష్ణ వేణి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం ఇంట్లో దొంగతనం జరిగితే 11వ తేదీన ఫిర్యాదు చేయడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. పోలీస్ స్టేషన్కు మైనర్ బాలికను పిలిపించే విచారణ చేయడంతో అవమానంగా భావించి మైనర్ బాలిక పురుగుల మందు సేవించింది. ఆత్మహత్య ప్రేరణకు కారణమైన బండ్ల రాజశేఖర్ రెడ్డిపై హత్యా నేరం సెక్షన్ ను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్