మహాత్మ గాంధీ వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించినట్టు అయిజ టౌన్ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు బి. మహేష్ నాయుడు గురువారం తెలిపారు. అహింస వాదంతో ఎంతటి కఠిన లక్ష్యమైనా చేదించవచ్చని నిరూపించి, ప్రపంచానికి నూతన పోరాట ఒరవడిని నేర్పిన జాతిపిత అని పేర్కొన్నారు. వలసవాదుల చెర నుండి భారతావనికి విముక్తి కలిగించారని గుర్తుచేశారు.