వడ్డేపల్లి మండలం బుడమూర్సు గ్రామంలో మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే డా. ఎస్. ఏ. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు కలరు.