పీసీసీ పదవిని దళిత సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే డా. S. A. సంపత్ కుమార్‌కు కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎస్. మద్దిలేటి డిమాండ్ చేశారు. శనివారం అయిజ మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకున్న ప్రజా నాయకుడు సంపత్‌కు పీసీసీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.