మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన పి. అలివేల గత కొంత కాలంగా హృద్రోగ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గురువారం యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల ఎల్ఓసి కాపిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జెసిఆర్, రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.