లగచర్ల ఉదంతం తీవ్ర ఆవేదనకు గురి చేసింది మహబూబ్ నగర్ ఎంపీ అరుణ అన్నారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో పర్యటించారు. లగచర్ల పరిసర ప్రాంత ఫార్మా బాధిత రైతులకు ఎంపీ డీకే అరుణ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ. ఈ మారుమూల గ్రామాలలో ఫార్మా పెడితే ఇక్కడి ప్రజలకు ఒరిగేది లేదని అన్నారు. మొత్తం 57 మందిలో 24 మంది విడుదల అయ్యారని మరో 15 మందికి బెయిల్ వచ్చేలా కృషి చేస్తా అని తెలిపారు.