రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో, మాజీ ఎమ్మెల్యే డా. ఎస్. ఏ. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు సబ్సీడీ గ్యాస్ ప్రొసీడింగ్ పత్రాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పచ్చర్ల కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 500 కే గ్యాస్ అందిస్తామన్నారు.