ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన గద్వాలలో కలెక్టర్ సంతోష్ తో కలిసి ఆయన అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కొత్తగా రూపొందించబోయే ఓటరు జాబితాలో ఓటర్ల నమోదు, ఫోటో మార్పు, పేర్లలో తప్పులు తదితరాలను సవరించి కొత్తగా జాబితాను తయారు చేయాలని సూచించారు. దీనికోసం మండలాల తహశీల్దార్ లు ఎప్పటికప్పుడు బిఎల్ఓ లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.