గద్వాల: అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఆర్టీసీ స్థలం

52చూసినవారు
జిల్లా కేంద్రమైన గద్వాలలోని కొత్త బస్టాండ్ ప్రహరీని అనుకుని ఉన్న ఆర్టీసీ ఖాళీ ప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఆర్టీసీ పెట్రోల్ బంక్, ఆర్టీసీ బస్టాండ్ రెండింటి మధ్యన ఉన్న స్థలంలో పిచ్చి మొక్కలు, ఆకులు, అలుము ఏపుగా పెరగడంతో రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా తయారైంది. గత కొన్నేళ్ల నుంచి సమస్య తీవ్రంగా ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయించి అభివృద్ధిలోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్