మహబూబ్ నగర్ పట్టణంలోని కూడళ్ల వద్ద, దేవాలయాల దగ్గర భిక్షాటన చేస్తున్న పిల్లలను రెస్క్యూ చేయాలని, తప్పిపోయిన పిల్లల వివరాలను 'దర్పన్ యాప్' లో అప్ లోడ్ చేయాలని జిల్లా ఎస్పీ డి. జానకీ సూచించారు. శుక్రవారం ఆపరేషన్ స్మెల్ 10పై జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని అన్నారు. అలాగే బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు.