మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని వివిధ వార్డుల్లో డ్రైనేజీ, రోడ్ల పరిశుభ్రతను కమిషనర్ సొంటే రాజయ్య గురువారం పరిశీలించారు. మున్సిపల్ సిబ్బందితో మురికి కాలువలను శుభ్రం చేయించారు. కాలనీ వాసులు ఇంటి చుట్టు పక్కల వర్షపు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుంకసారి రమేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.