మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి హాజరై మాట్లాడుతూ.. గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువుదే గొప్ప స్థానం అని జిల్లా కలెక్టర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జరుపుకుంటున్నామన్నారు. గురువులను అందరూ ఆరాధించాలన్నారు.