జడ్చర్ల: పగిలిన టైర్.. ప్రయాణికులు ఇబ్బందులు..!

78చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం షాద్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వెనక టైరు పగిలిపోవడంతో బస్సు ఆగింది. దీంతో బస్సులో హైదరాబాద్ వెళుతున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. మరో బస్సు కోసం రోడ్డుపై ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాసేపటి తరువాత మరో డిపోకు చెందిన బస్సులో కండక్టర్ ప్రయాణికులను పంపించారు.

సంబంధిత పోస్ట్