జడ్చర్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్రవారం మండల పూజ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆభరణాల ఊరేగింపులో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరై స్వామివారి ఆభరణాలను స్వయంగా తన తలఫై మోస్తూ అయ్యప్ప స్వామి వారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పెద్ది బాలకృష్ణ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.