గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో చోటుచేసుకుంది. మంగళవారం ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం బారా చాత్రర్ గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ (26) స్థానికంగా ఓ కంపెనీలో పని చేయడానికి గత రాత్రి రైలులో బాలానగర్ వచ్చాడు. కంపెనీ దగ్గరకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడేనే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.