మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బాదేపల్లి కోట మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలకు, కావేరమ్మపేట బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి కృప, కటక్షాలు నియోజకవర్గం ప్రజలకు ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.