మహబూబ్ నగర్ జిల్లాలో దీపావళి పండుగను పురస్కరించుకుని మట్టి ప్రమిదల అమ్మకాలు జోరందుకున్నాయి. జిల్లా కేంద్రంలోని మల్లికార్జున్ ఎంటర్ప్రైజెస్, బస్టాండు, మెట్టుగడ్డ, న్యూటౌన్, గడియారం చౌరస్తాలలో మట్టి ప్రమిదలను వ్యాపారులు పెద్ద ఎత్తున అమ్మకానికి ఉంచారు. వివిధ రూపాలలో మట్టి ప్రమిదలు లభ్యం అవుతుండడంతో పట్టణ ప్రజలు కొనేందుకు ఆసక్తి కనబరిచారు. జత ప్రమిదలు రూ. 20 నుంచి డిజైన్ బట్టి దాదాపు రూ. 100 వరకూ ధర పలికాయి.