మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డిని హెచ్చరిస్తూ మావోయిస్టు లేఖ కలకలం రేపుతుంది. సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో గోడలపై భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పేరిట లేఖ శనివారం ప్రత్యక్షమైంది. గ్రామంలోని మాన్యాలను లాక్కొని, పట్టాదారులను బెదిరించి నీపేరుపై పట్టా చేయించుకున్నావని లేఖలో పేర్కొన్నారు. ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే ప్రజాకోర్టులో తీర్పు తప్పదంటూ లేఖలో ప్రస్తావించారు.