మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం శనివారం ఉదయం మంచు దుప్పటితో కప్పేసుకుంది. జడ్చర్ల మండల కేంద్రంలోని నిన్నటి కంటే ఉష్ణోగ్రత తక్కువ కావడంతో వృద్ధులు, చిన్నారులు చలితో అవస్థలు పడుతున్నారు. పొగమంచుతో మినీ క్రీడా ప్రాంగణంలో కాశ్మీర్ ఢిల్లీ సిమ్లాను తలపిస్తుందని వాకర్ లు అభిప్రాయపడ్డారు. కాగా చలి తీవ్రతతో పొలాలలో వరి నారు ఎండిపోతుందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.