అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 37లో 70 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్ దీపాల ఏర్పాటుకు గురువారం శంకుస్థాపన చేశారు. వార్డులోని ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో నూతన షెడ్ నిర్మాణం చేపట్టేందుకు ముడా నిధులతో నిర్మాణం చేపట్టేందుకు ఎస్టిమేట్స్ చేయమని అధికారులను ఆదేశించారు.