జాతీయ జెండా పంపిణీ చేసిన కౌన్సిలర్లు

1151చూసినవారు
జాతీయ జెండా పంపిణీ చేసిన కౌన్సిలర్లు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఏడవ వార్డు కౌన్సిలర్ గోరటి శ్రీనివాసులు, ఎనిమిదవ వార్డ్ లక్ష్మీ రాంరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా తమ 7వ. 8వ. వార్డులలో తిరుగుతూ జాతీయ జెండాను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వార్డ్ కౌన్సిలర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, స్వాతంత్ర పోరాట యోధులకు స్మరిస్తూ వారి స్ఫూర్తితో ప్రగతి ప్రయాణం కొనసాగించాలని. వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాజీ ఎంపీటీసీ కనుక రాం పర్వతాలు, చెన్నకేశవులు నరేందర్, దున్న సురేష్, శివ. బాలరాజు, శివ, రామకృష్ణ, శ్రావణ్, శేఖర్, పవన్, స్వామి, లక్ష్మయ్య, ఖాదర్, భానుశ్రీ, పెంటమ్మ, పార్వతమ్మ, అనసూయ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్