జాతీయ జెండా పంపిణీ ఇంటింటికి పంపిణి

889చూసినవారు
జాతీయ జెండా పంపిణీ ఇంటింటికి పంపిణి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో 21వ వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 15 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఇంద్రానగర్ కాలనీ 21వ వార్డులో శేఖర్ గౌడ్. శ్రీధర్. ఓం ప్రకాష్ లతో జాతీయ జెండాను పంపిణీ చేయడమే కాక ఇంటిపై స్వయంగా జాతీయ జెండాను పెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా 21 వార్డ్ కౌన్సిలర్ సైదులు గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 15 రోజులపాటు రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారని. స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు కదలాలని. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, శ్రీధర్. ఓం ప్రకాష్, లక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కుమార్, శ్రీనివాసులు, జంగమ్మ, శ్రీరాములు, ప్రసాద్, వినోద్, ఇంద్రానగర్ కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్