ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

485చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందల తెలంగాణ తల్లి విగ్రహం పక్కన శనివారం తెలంగాణ తొలి దశ, మలి దశా ఉద్యమ సారథి, తెలంగాణ నా జీవితమని ప్రకటించి త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి విశ్వబ్రాహ్మణ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ రాజేందర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ సభ్యులు, విశ్వబ్రాహ్మణ డివిజన్ కమిటీ సభ్యులు, అన్ని పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేసారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్