నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన దేవేందర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు పరిధిలోని చిన్న కార్పాముల, రాయవరం గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నాడు. ఆన్ లైన్ గేమింగ్ లకు అలవాటు పడి ఖాతాదారులకు సుమారు రూ. 50 లక్షల వరకు ఇవ్వకుండా తిప్పుతున్నాడు. దీంతో ఆగ్రహించిన ఖాతాదారులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.