నారాయణపేట జిల్లా మక్తలోని బీసీ కాలనీలో నూతనంగా ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం చేయుటకు అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం స్థలాన్నిపరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని నాభిశిల వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 24న సీతారాముల కళ్యాణమండపంలో ప్రత్యేక హోమది పూజలు నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. అఖిలపక్షం నాయకులు కొండయ్య, చంద్రకాంత్ గౌడ్, మల్లికార్జున్ , రాజశేఖర్ రెడ్డి, కావలి వెంకటేష్, మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.