అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించి వారిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మక్తల్ మండలం కాచ్ వార్ గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అర్హులైన అందరికీ పథకాలు అందుతాయని అన్నారు. ఎమ్మెల్యే శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.