ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో శనివారం సాయంత్రం కార్యక్రమాలు ముగించుకొని మక్తల్ పట్టణానికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనను చూసి తన వాహనాన్ని నిలిపి బాధితులకు సహాయం చేశారు. అంబులెన్స్ లో బాధితులను ఆసుపత్రికి పంపించారు. మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యేను నియోజకవర్గ ప్రజలు అభినందించారు.