మక్తల్ పట్టణ శివారులో బొలెరో వాహనంలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దాడులు చేసి పట్టుకున్నట్లు చెప్పారు. మొత్తం 21 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ చేసి రెవెన్యూ అధికారుల పంచనామా మేరకు రేషన్ బియ్యం తరలిస్తున్న విరేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.