మక్తల్: మార్కెట్ చైర్ పర్సన్, డైరెక్టర్లను సన్మానించిన ఎమ్మెల్యే

54చూసినవారు
మక్తల్ పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గవినోళ్ళ రాధ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్ కుమార్, డైరెక్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రైతులకు సౌకర్యాలు కల్పించి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్