వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి నాగర్ కర్నూల్ జిల్లా డిఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డిఎంఎస్ వెంకట దాస్ లు ఆదేశించారు. గురువారం కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.