నాగర్ కర్నూల్ జిల్లాలో పంటలకు సాగునీరందిస్తున్న కెఎల్ఐ కాలువ తెగింది. వెల్దండ మండలం చెరుకూరు గ్రామ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి82 ప్రధాన కాలువకు తెగింది. కాలువ నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంటపొలాలు మునిగాయి. రైతులకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. కాలువ తెగి నీరు వృథాగా పోతుండడంతో నీరు చేతికి వచ్చిన పంట నష్టపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు