దేశంలో కమ్యూనిస్టులంతా ఏకం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. బాల నర్సింహ పిలుపునిచ్చారు. పార్టీ ఏర్పడి వందేళ్లు అవుతున్న సందర్భంగా గురువారం పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంక్షేమ పథకాల అమలుకు పార్టీ ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు.