వర్షం తగ్గుముఖం పడుతున్న తరుణంలో వ్యాధుల పాలయ్యే అవకాశం ఉందని, ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ డాక్టర్ మల్లు రవి మంగళవారం తెలిపారు. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, జోగులాంబ జిల్లాల కలెక్టర్లతో చరవాణి ద్వారా ఎంపీ మల్లు రవి మాట్లాడినారు. ఈ సందర్భంలో ప్రజలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా జిల్లా వైద్య అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.