నారాయణపేట మండలం, సింగారం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం నూతనంగా ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అంతకు ముందు సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఉపాధ్యాయుడు వెంకటయ్య పెద్ద కూతురు శ్రావ్య పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు పలకలను పంపిణి చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.