నారాయణపేట: గ్రూప్ - 2 పరీక్షకు 51 శాతం హాజరు

71చూసినవారు
నారాయణపేట: గ్రూప్ - 2 పరీక్షకు 51 శాతం హాజరు
నారాయణపేట పట్టణంలో 13 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జరిగిన గ్రూప్ -2 పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షకు 3, 994 మంది అభ్యర్థులకు గాను 2, 052 మంది హాజరు కాగా, 1, 942 మంది గైర్హాజరు అయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 2, 046 మంది హాజరు కాగా, 1, 948 మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్