భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా నారాయణపేట మండలం, జాజాపూర్ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ లో గురువారం మద్యాహ్నం కంగలి వెంకటేష్ డ్రాయింగ్ టీచర్ చిరుధాన్యాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని వేశారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మినపపప్పు, రాగులు, సజ్జలు, పెసర ఊలువలు తదితర చిరు ధాన్యాలతో చూపరులను ఆకట్టుకునే విధంగా పటాన్ని వేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు వెంకటేష్ ను అభినందించారు.