నారాయణపేట: మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలి

64చూసినవారు
నారాయణపేట: మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలి
జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ఆర్డీవో మధుమోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో మాదకద్రవ్యాల నిషేధంపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూనియర్, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన యాoటీ డ్రగ్ కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్