నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. మద్దూరు మండలం పెదిరిపాడ్, నారాయణపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు విద్యార్థులను అభినందించారు.