నారాయణపేట మండలం సింగారం గ్రామ శివారులోని కౌరంపల్లి మైసమ్మ జాతర మహోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకం, అలంకరణ సేవ, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేళాతాళలతో సింగారం గ్రామం నుంచి భారీ ఎత్తున మహిళలు భక్తిశ్రద్దలతో బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి మైసమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ప్రదక్షిణలు చేసి, కోళ్లతో నైవేధ్యాలను సమర్పించారు.