కోస్గి మండలం తిమ్మాయపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు కానుకలు వేయడానికి హుండీని ఏర్పాటు చేశారు. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు వచ్చి హుండీని పగలగొట్టి నగదు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కొందరు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఉండవచ్చు అని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.