ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు

84చూసినవారు
ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని నారాయణపేట పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. బాపునగర్ చౌడేశ్వరి మాత ఆలయంలో మహిళలు సామూహిక వ్రతాలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఒక పాఠశాలలో మహిళ టీచర్లు వరలక్ష్మి చిత్రపటానికి పూజలు చేసి మహ మంగళ హారతులు చేశారు. వరలక్ష్మి వ్రతం విశిష్టతను విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్